* కరోటిడ్ ఆర్డరీ డిసెక్షన్ ద్వారా రోగికి పునర్జన్మ
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 12(విజయక్రాంతి): అత్యవసర వాస్కులర్ సమస్యలకు కేర్ ఆస్పత్రుల్లో నాణ్యమైన చికిత్స అందిస్తున్నట్లు ఆ ఆస్పత్రి హైటెక్‌సిటీ సీవోవో నీలేష్‌గుప్తా, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజీ వైద్యుడు డా.కైలాశ్ మిర్చే తెలిపారు. నగరంలోని ఒక యువకుడికి కేవలం 20నిమిషాల్లోనే కరోటిడ్ ఆర్డరీ డిసెక్షన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని.. అతి క్లిష్టమైన వాస్కులర్ ఇబ్బందులను తొలగించడం ద్వారా రోగికి ఉపశమనం కల్పించినట్లు చెప్పారు.
వ్యాయామం వల్ల ఆ యువకుడికి మెడనొప్పి, వాంతులు, ఎడమవైపు హెమిపరేసిస్‌తో బాధపడటంతో పాటు తీవ్రమైన గుండెనొప్పితో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో హైటెక్ సిటీలోని కేర్ ఆస్పత్రిలో చేరగా అతని స్థితిని అంచనావేసి తమ వైద్య బృందం.. సిటీస్కాన్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి రోగి కరోటిడ్ అర్టరీ డిసెక్షన్‌ను అనుభవిస్తున్నట్లు గుర్తించామన్నారు.
దీంతో అతడికి థ్రోంబోలిసిస్ వైద్య ప్రక్రియను ప్రారంభించి.. కేవలం 20 నిమిషాల్లోనే ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలిపారు. దీంతో 2- గంటల్లోనే రోగి ఆరోగ్య స్థితిలో మెరుగుదల కనిపించిందన్నారు. కేర్ ఆస్పత్రి వైద్యుల అసాధారణ ఆరోగ్య సంరక్షణ నైపుణ్యానికి రోగి కృతజ్ఞతలు తెలిపారు.