calender_icon.png 17 October, 2024 | 5:05 AM

వృద్ధుడి ప్రాణాలను కాపాడిన ‘కేర్’ వైద్యులు

17-10-2024 03:02:34 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 16 (విజయక్రాంతి): తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వృద్ధుడికి బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రి వైద్యులు క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసి అతడి ప్రాణాలను కాపాడారు. చిక్కడపల్లికి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు అధిక రక్తపోటు, మధుమేహం, కరోనరీ ఆర్టిలరీతో బాధపడుతున్నాడు. బాధితుడు గతంలోనే కరోనరీ యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. తాజాగా కేర్ వైద్యులు రేనల్ డినర్వేషన్ ట్రీట్‌మెంట్‌తో చికిత్స చేసి అతడి ప్రాణాలు కాపాడారు. శస్త్రచికిత్సలో క్యాథ్‌ల్యాబ్ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్  కపర్ది భాగస్వాములయ్యారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అజిత్ సింగ్ తెలిపారు.