హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6(విజయక్రాంతి): నగరంలోని మహావీర్ మెమోరియల్ ట్రస్ట్ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్‌కు ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ‘కార్డియోసేవ్ హైబ్రిడ్ ఆటోమేటిక్ మెడికల్’ పరికరాన్ని అందించింది. ఆస్పత్రిలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ మహేంద్రకుమార్ రంకాకు.. ఎల్‌ఐసీ జోనల్ మేనేజర్ పునీత్‌కుమార్ ఈ పరికరాన్ని అందజేశారు. తమ ఆస్పత్రిని కనీస ధరలకే నాణ్యమైన వైద్యసేవలందిస్తున్నట్లు మహేంద్రకుమార్ తెలిపారు.
హరేకృష్ణ ట్రస్ట్‌కు వాహనం అందజేత
బంజారాహిల్స్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో హరేకృష్ణ మూవ్‌మెంట్ వారికి ఆహారాన్ని రవాణా చేసేందుకు ఒక ప్రత్యేక వాహనాన్ని ఎల్‌ఐసీ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ అందించారు. ట్రస్ట్ ఉపాధ్యక్షుడు మహావిష్ణుదాసా వాహన కీని స్వీకరించారు. 2009నుంచి పేదలకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ఐసీ సీనియర్ అధికారులు జీబీవీ రామయ్య, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.