calender_icon.png 23 January, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాయల్ కాలనీలో కార్డెన్‌సెర్చ్

26-08-2024 03:30:19 AM

  1. అదుపులోకి ముగ్గురు రౌడీషీటర్లు, ముగ్గురు అనుమానితులు 
  2. సరైన పత్రాలు లేని 63 వాహనాలు సీజ్

మహేశ్వరం, ఆగస్టు 25: బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నెల రోజుల వ్యవధిలోనే వరుసగా రెండు హత్యలు జరగడంతో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. ఆదివారం ఉదయం రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాల మేరకు మహేశ్వరం డీసీపీ సునీతరెడ్డి, ఏసీపీ లక్ష్మికాంత్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ భూపతితో పాటు 287 మంది పోలీసులు కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. రాయల్ కాలనీలో అణువణువు సోదా చేశారు. బర్మా దేశం నుంచి వలస వచ్చి నివసిస్తున్న వారి వివరాలు సేకరించారు. సరైన పత్రాలు లేని 63 ద్విచక్ర వాహనాలతో పాటు ఇతర వాహనాలను సీజ్ చేశారు. ఓ కంపెనీలో బొట్టిల్స్ స్టోరోయిడ్ ఆఫ్ ఆక్సిజన్ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు రౌడీషీటర్లతో పాటు మరో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.