calender_icon.png 25 September, 2024 | 10:03 AM

పార్టీ ఫిరాయింపులకు కేరాఫ్ బీఆర్‌ఎస్సే

25-09-2024 02:16:33 AM

  1. ఉప ఎన్నికలు వస్తే ఆ పార్టీని అడ్రస్ లేకుండా చేస్తాం 
  2. విప్ ఆది శ్రీనివాస్

హైదరాబాద్, సెప్టెంబర్ 24         (విజయక్రాంతి): పదేళ్లలో పార్టీ ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న కేటీఆర్.. ఇప్పుడు నీతులు చెప్పడమేంటనీ? ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్ ప్రశ్నించారు. 60కి పైగా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని, కేటీఆర్ ఫిరాయింపుల గురించి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నాడు గులాబీ కండువా కప్పిన వెదవ ఎవరని? మంగళవారం ఒక ప్రకటనలో నిలదీశారు. రోజుకో ఎమ్మెల్యేను చేర్చుకుని చివరకు విలీనమంటూ పచ్చి అబద్ధాలు చెప్పిన దగాకోరుల ని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేల చేరికల అంశం కోర్టు పరిధిలో ఉందని, దానిపై కేటీఆర్ పదేపదే మాట్లాడటం సరికాదన్నారు.

లోక్‌సభ ఎన్ని కల్లో బీఆర్‌ఎస్‌ను ప్రజలు జీరో చేసి నా బుద్ధి రాలేదన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ పార్టీని ఓడించామని, ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఆ పార్టీని రాష్ట్రంలో అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు.