calender_icon.png 7 April, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నాళ్లకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ..

07-04-2025 05:40:46 PM

కాంగ్రెస్ పేదల పార్టీ..

హుజురాబాద్ నియోజకవర్గం ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు..

హుజురాబాద్ (విజయక్రాంతి): దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు సన్న బియ్యం ఇస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఓడితల ప్రణవ్ బాబు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఇందిరానగర్ 13వ వార్డులో రేషన్ కార్డు లబ్ధిదారులు శ్రీ వాణి-శ్రీనివాస్ భోజనానికి ఆహ్వానించగా, ప్రణవ్ వాళ్ళింటికి వెళ్లి సహపంక్తి  భోజనం చేశారు.

ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకు రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఉచిత సన్న బియ్యం కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో ఇచ్చిన హామీలు ప్రకారం ఒక్కొక్కటి నెరవేర్చు వస్తుందని ప్రతి ఒక్క అర్హుడికి కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అందుతాయి అన్నారు. ఇలాంటి పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రణవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షుడు కాజీపేట శ్రీనివాస్, వేముల పుష్పలత, దుబాసి బాబుతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.