- అతివేగంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన డ్రైవర్
- తప్పిన ప్రాణాపాయం, ఘటనా స్థలం నుంచి పరార్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 19 (విజయక్రాంతి) : బంజారా హిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 వైపు అతివేగంగా దూసుకువచ్చిన కారు రోడ్డు డివైడర్‌పైకి ఎక్కి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమయ్యింది. అయితే ఘటనలో కారు డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.
అయితే కారు స్తంభాన్ని ఢీకొట్టన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా.. సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగులను పిక్ అండ్ డ్రాపింగ్ చేసే కారుగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.