calender_icon.png 24 December, 2024 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

02-11-2024 01:57:04 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1 (విజయక్రాంతి): బంజారా హిల్స్ రోడ్డు నంబర్ 14లో ఓ కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున అతివేగంతో కేబీఆర్ పార్క్ ఫుట్‌పాత్‌పై ఉన్న ప్రహరీ గ్రిల్స్‌ను ధ్వంసం చేసుకుంటూ వెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం తర్వాత డ్రైవర్, అందులో ఉన్న వ్యక్తులు కారును అక్కడే వదిలి పారిపోయారు.

సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుం దని పోలీసులు అనుమానిస్తున్నారు.