పార్కు చేసిన మరో కారు, ఆటోపై దూసుకెళ్లిన వైనం
డ్రైవర్ సహా ఐదుగురికి గాయాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31 (విజయక్రాంతి): బంజారాహిల్స్‌లో కారు భీభత్సం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాలు.. శనివారం తెల్లవారుజామున బంజారాహిల్స్ రోడ్ నం.2లో వేగంగా వచ్చిన కారు ఓ కమర్షియల్ కాంప్లెక్స్ ముందు పార్క్ చేసి ఉంచిన కారు, ఆటో మీదికి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్‌తో పాటు భార్యభర్త వారి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరంతా శంషాబాద్ నుంచి బంజారాహిల్స్ మీదుగా చిలకలగూడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదంలో డ్రైవర్‌కి తీవ్ర గాయాలు కాగా.. కారులోని నలుగురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మైనర్‌గా తెలుస్తోంది. ప్రమాదంలో పల్ట్టీకొట్టిన కారుతో పాటు పార్కింగ్‌లో ఉన్న కారు, ఆటో నుజ్జునుజ్జు అయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.