పెబ్బేరు,(విజయక్రాంతి): వనపర్తి జిల్లా(Wanaparthy District) పెబ్బేరు మున్సిపాలిటీ(Pebbair Municipality) సమీపం ఆనంద్ డాబా దగ్గర 44వ జాతీయ రహదారిపై అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటనలో ఒకరికి గాయలైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం... కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా జిల్లా, షాధిపూర్ గ్రామానికి చెందిన సచిన్, లత దంపతులు బెంగుళూరుకు వెళ్లుతున్న క్రమంలో కారు అదుపు తప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో లతకు స్వల్ప గాయలయ్యాయి. గాయపడిన లతను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ఆసుపత్రికి తరలించారు.