calender_icon.png 10 January, 2025 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలాల్‌పూర్ వద్ద ఆందోళన.. నిలిచిపోయిన రాకపోకలు

07-12-2024 12:18:13 PM

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ వద్ద ఆందోళన నెలకొంది. శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగిన స్థలంలో జలాల్ పూర్ వాసులు ధర్నాకు దిగారు. మూలమలుపు వద్ద తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూలమలుపు వద్ద సూచిక ఏర్పాటు చేయాలని గ్రామస్థుల ఆందోళన చేపట్టారు. అధికారులు తక్షణమే పరిస్థితి చక్కదిద్దాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. జలాల్ పూర్ వాసుల ధర్నా వల్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ సమీపంలో శనివారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో ఐదుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మృతులు హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లోని ఆర్టీసీ కాలనీ వాసులు హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్‌లుగా గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భోంగీర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. అయితే వారిలో మణికంఠ యాదవ్ అనే వ్యక్తి కారు అద్దాలు పగులగొట్టడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. హైదరాబాద్‌ నుంచి భూదాన్‌ పోచంపల్లికి వెళ్తున్న వీరు ఘటనా సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులంతా 20 నుంచి 21 ఏళ్ల మధ్య వయస్కులే కావడం గమనార్హం.