calender_icon.png 14 February, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

19న కారు పార్టీ కార్యవర్గ సమావేశం

14-02-2025 01:38:18 AM

  1. పార్టీ 25 ఏండ్ల వేడుకలు, సభ్యత్వ నమోదు.. తదితర అంశాలపై చర్చ
  2. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు శ్రేణులకు దిశానిర్దేశం
  3. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): ఈనెల 19న బీఆర్‌ఎస్ రాష్ర ్టకార్యవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించా లని పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు  పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 19న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో ఈ సమావేశం జరుగనున్నది.

అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ర్ట కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులు హాజరుకానున్నట్లు కేటీఆర్ తెలిపారు.

ఈ ప్రత్యేక సమావేశంలో పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు కావొస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృతస్థాయిలో చర్చించనున్న ట్లు పేర్కొన్నా రు.

రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, రాష్ర్ట ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రధానంగా చర్చ జరుగుతుందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా బీఆర్‌ఎస్ శ్రేణులు చేపట్టవలసిన కార్యాచర ణపై కూడా చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించుకుంటూ, ప్రజలను చైతన్యం చేసేందుకు కార్యకర్తలు, శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహా లపై ఈ విస్తృతస్థాయి సమావేశంలో చర్చించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.