calender_icon.png 20 April, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధారిలో అదుపుతప్పి కారు బోల్తా.. యువతి మృతి

09-04-2025 05:10:12 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో గల హిందుస్థాన్ పెట్రోల్ బంకు వద్ద కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం... మండలంలోని చిన్న గుట్ట తండాకు చెందిన ఒక కుటుంబం హైదరాబాద్ లో పని నిమిత్తం వెళ్ళారు. తమ పనులు ముగించుకుని స్వస్థలానికి బయలుదేరి వస్తున్న సమయంలో బుధవారం ఉదయం 3 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని జంతువు ఒక్కసారిగా అడ్డు రావడంతో కారు అదుపుతప్పి బోల్తా కొట్టిందని వారు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న బదావత్ పూజ(22) అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ప్రయాణిస్తున్న మిగతా బాధితులు శివ కృష్ణ, శిల్ప, మౌనికలు తీవ్రగాయాల పాలయ్యారు. గాయపడిన ముగ్గురిని గాంధారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.