డ్రైవర్‌కు తీవ్రగాయాలు
కొండపాక, డిసెంబర్ 1: కారు బోల్తా పడిన ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కొండపాక మండ లం దుద్దెడ కలెక్టర్ కార్యాలయం ముందు రాజీవ్ రహదారిపై ఆదివారం ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దుబ్బాక మండలం కమ్మర్‌పల్లికి చెందిన రవి కారులో సిద్దిపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా కారు అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో రవి కాలు విరిగింది. కారు ఇంజిన్ రోడ్డుపై ఎగిరిపడింది. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.