మహేశ్వరం, నవంబర్ 5: ఓఆర్ఆర్పై తుక్కుగూడ ఎగ్జిట్-14 వద్ద మంగళవారం ఘట్కేసర్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న ఓ కారు ముందుభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన కారు డ్రైవర్ చాకచక్యంగా కారు దిగిపోయాడు. ఓఆర్ఆర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. అందరూ చూస్తుండగానే కారు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనపై పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డిని సంప్రదించగా కారు దగ్ధం ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు.