calender_icon.png 10 April, 2025 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు

05-04-2025 10:54:01 PM

కొండపాక: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయలైన సంఘటన కుకునూర్ పల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. కుకునూర్ పల్లి మండలం మంగోల్ గ్రామానికి చెందిన చెప్యాల బాల్ రెడ్డి తన భార్య చెప్యాల కిష్టమ్మలు మంగోల్ నుంచి ద్విచక్ర వాహనంపై కుకునూర్ పల్లికి వస్తుండగా గ్రామ శివారులో యుటర్న్ అవుతుండగా సిద్దిపేట నుంచి హైదరాబాదు వెళ్తున్న కారు ద్విచక్రవాహనంను వెనక నుంచి ఢీకోట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న చెప్యాల కిష్టమ్మకు తీవ్ర గాయలయి, కాలు విరిగింది. మరోకరికి స్వల్ప గాయలైనవి, స్థానికుల సహాయంతో అంబులెన్స్ లో ప్రజ్ఞపూర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.