దంపతులు మృతి
మద్యం మత్తులో కారు డ్రైవింగ్, నిందితుడి అరెస్ట్
కార్వాన్, డిసెంబర్1: మద్యం మత్తులో ఓ వ్యక్తి కారు డ్రైవింగ్ చేసి స్కూటీపై వెళ్తున్న దంపతులను ఢీకొనడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన ఘటన ఆదివారం లంగర్‌హౌస్ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ రఘుకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పెన్షన్‌పురకు చెందిన దినేశ్ గిరి(35), మోనా ఠాకూర్(35) దంపతులిద్దరూ శనివారం రాత్రి స్కూటీపై లంగర్‌హౌస్ నుంచి నానల్‌నగర్ వైపు వెళ్తున్నారు.
ఫ్లోర్‌మిల్ సమీపంలో ఓ కారు అతివేగంగా వచ్చి వీరి స్కూటీతోపాటు మరో రెండు వాహనాలను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దినేశ్‌గిరి దంపతులు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదానికి కారణమైన వికారాబాద్ జిల్లా మోత్కూరుకి చెందిన ప్రణయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.