calender_icon.png 28 December, 2024 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు..- ఒకరు మృతి

27-12-2024 12:00:00 AM

  • మరో ముగ్గురికి గాయాలు 
  • వెంకట్రావుపల్లి వద్ద ఘటన

సిరిసిల్ల, డిసెంబరు 26 (విజయక్రాం తి) : ఆగి ఉన్న లారీని వెనుక నుండి కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయి నపల్లి మండలం వెంకట్రావుపల్లి సమీపం లోని నర్సింగాపూర్ స్టేజి వద్ద  గురువారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎండి కాలనీకి చెందిన పోలవేణి గట్టు బాబు తమ్ముని కుమారుడు నూతన గృహ నిర్మాణం కడప పెట్టేందుకు ఆహ్వానించా రు.

ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారు జామున  గట్టు బాబు, భార్య మంగ తో పాటు చెల్లెలు అహల్య, బావ అశోక్ లతో కలిసి వెళ్లి ఇంటి కడప పెట్టి, వేములవాడ రాజన్న దర్శనం చేసుకున్నారు. తిరిగి ఉద యం కరీంనగర్‌కు వస్తుండగా వెంకట్రావు పల్లి సమీపంలోని  నర్సింగాపూర్ స్టేజి  వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జు నుజ్జు కాగా,భార్య మంగ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురకి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు  క్షతగాత్రు లను చికిత్స నిమిత్తం 108కు, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. మృ తదేహాన్ని పంచనామా నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.