08-02-2025 12:00:00 AM
ఇద్దరు మృతి... మరొకరికి తీవ్ర గాయాలు
గజ్వేల్, ఫిబ్రవరి7 : ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టిన ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయిపోగా, కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
శుక్రవారం ఎన్టిపిసి రామగుం డం నుండి కారులో మెరుగు లింగం (52), తమ్ముడు మెరుగు మహేష్ (43), మేనల్లు డు బినేష్ (29), డ్రైవర్ ప్రణయ్ సాగర్ పని నిమిత్తం హైదరాబాద్‌కు బయలుదేరా రు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు సమీ పంలోకి రాగానే ఆగి ఉన్న లారీని వెనక నుండి వేగంగా కారుతో ఢీకొట్టారు.
ఈ కారులో ప్రయాణిస్తున్న లింగం, బినేష్ అక్కడికక్కడే మృతి చెందారు. మహేష్ తీవ్ర గాయాలు కాగా అంబులెన్స్‌లో గజ్వ్లెల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం యశోద ఆసుప త్రి తరలించారు. డ్రైవర్ ప్రణయ్ సాగర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.