calender_icon.png 7 February, 2025 | 6:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డుపై లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

07-02-2025 03:17:52 PM

ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం 

గజ్వేల్,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్(Gajwel Pragnapur) మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ ఓటర్ రోడ్డు(Pragnapur Ring Road)పై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోదావరిఖని నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు  ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జు అయిపోయింది.   ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వ్యక్తిని 108లో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు మెరుగైన చికిత్ర కోసం యశోద ఆసుపత్రికి రిఫర్ చేశారు. సమాచారం అందుకున్న గజ్వేల్  పోలీసులు ప్రమాద స్థలాన్ని చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, లారీని అదుపులోకి తీసుకున్నారు. మృత్తులు లింగం(48), మహేష్(28)లుగా, గాయపడిన వ్యక్తి ప్రణయ్ గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.