calender_icon.png 9 January, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు

06-01-2025 10:07:00 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) కేంద్రంలో సోమవారం తృటిలో ప్రమాదం తప్పింది. పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలోని రుక్మిణి కుంట ప్రాంతంలో విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టింది. కారు ఢీకొనడంతో స్తంభంపై మంటలు చెలరేగాయి. స్థంభం విరిగి కారుపై పడింది. ఆ సమయంలో అటువైపుగా ఎవరు రాకపొవడంతో పెను ప్రమాదం తప్పింది. పక్కనే పార్క్ చేసిన బైక్ ద్వంసమైంది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు ఉన్నారని తెలుస్తోంది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.