18-03-2025 12:06:19 AM
రామాయంపేట,మార్చి17ః జాతీయ రహదారిపై కారు డివైడర్ను ఢీకొట్టడంతో టైరు పేలిపోయింది. ఈ ఘటనతో ఎలాంటి పెను ప్రమాదం తప్పింది. ఆర్మూర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న న్యూ బొలెరో కారు రామాయంపేట మండల కేంద్రంలో పెద్దమ్మ ఆలయం వెనుక జాతీయ రహదారిపై డివైడర్ కు ఢీకొట్టింది. దీంతో టైరు పేలిపోయి పల్టీలు కొట్టి కారు రోడ్డు కిందికి దూసుకుపోయింది.
దాంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న మహేశ్, హరిలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ఈ మేరకు రామాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుఅయనతెలిపారు.