calender_icon.png 3 April, 2025 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్ ను ఢీకొట్టిన కారు

02-04-2025 10:49:54 PM

వ్యక్తి మృతి.. 

పటాన్ చెరు: పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డులో బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పటాన్ చెరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు... అమీన్ పూర్ మున్సిపల్ బీరంగూడకు చెందిన సూర వెంకటేశం (45) పటాన్ చెరు సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ఇంద్రేశం వైపు తన బైక్ పై వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన సూరం వెంకటేశం మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.