calender_icon.png 12 January, 2025 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువులోకి కారు.. ఐదుగురు జలసమాధి

08-12-2024 01:41:11 AM

  1. ప్రాణాలతో బయటపడిన మరో యువకుడు
  2. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పురం వద్ద ఘటన
  3. మృతులు ఎల్‌బీనగర్ ఆర్టీసీ కాలనీకి చెందినవారు

జనగామ, డిసెంబర్ 7 (విజయక్రాంతి): కల్లు కోసం వెళ్లిన యువకుల కారు ప్రమాదవశాత్తు చెరువులోకి దూసుకెళ్లడంతో ఐదుగురు జలసమాధి అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ శివారులో ఈ ఘటన చోటు చేసుకున్నది. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన హర్ష, దినేశ్, వంశీ, వినయ్, బాలు, మణికంఠ స్నేహితులు.

వీరంతా శుక్రవారం అర్ధరాత్రి కారులో బయటికి వచ్చి మద్యం తాగారు. తెల్లవారుజామున ఈత కల్లు కోసం పోచంపల్లికి బయలుదేరారు. వారికి ఆకలివేయగా చుట్టుప క్కల ఏమీ లేకపోవడంతో రంగారెడ్డి జిల్లా కొత్తగూడెంకు వెళ్లారు. మళ్లీ పోచంపల్లికి వస్తుండగా మార్గమధ్యం లో జలాల్పురం చెరువు కట్టపై ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి చెరువు లోకి దూసుకెళ్లింది.

కారులోని మణికంఠ ఒక్కరే కారు అద్దాలు పగుల గొట్టుకొని బయటపడగా.. మిగతా వారు జలసమాధి అయ్యారు. స్థానికులు గమనించి 100కు డయల్ చేయ గా పోలీసులు అక్కడికి చేరుకుని కారు ను బయటికి తీశారు. అంతకు ముందు వారు జాతీయ రహదారిపై జరిగిన ఒక ప్రమాదాన్ని చూసి అయ్యో అనుకు న్నారు.

ఆ తర్వాత  వారు కూడా మృత్యువాత పడ్డారు. మృతదేహాలను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతులంతా పాతికేళ్ల వయస్సు లోపు వారేనని పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనతో ఎల్‌బీనగర్‌లోని ఆర్టీసీ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.