calender_icon.png 29 April, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనంపైకి దూసుకెళ్లిన కారు.. 11 మంది దుర్మరణం

28-04-2025 09:11:20 AM

ఒట్టావా: కెనడా వాంకోవర్‌(Vancouver)లో జరిగిన ఒక ఉత్సవంలో జనంపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో కనీసం 11 మంది మరణించారని పోలీసులు నిర్ధారించారు. ఈ దుర్ఘటనలో మరో 20 మందికి పైగా గాయపడ్డారని కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ(Canadian Prime Minister Mark Carney) తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. వాహనాన్ని నడిపిన 30 ఏళ్ల  వ్యక్తిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ప్రమాదంపై వాంకోవర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ స్పందిస్తూ ఇది ఉగ్రవాద చర్య కాదని, నిందితుడికి మానసిక సమస్యలు ఉన్నాయని తెలిపింది.

ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది. నగరంలోని దక్షిణాన తూర్పు 43వ అవెన్యూ, ఫ్రేజర్‌లో ఫిలిప్పీన్స్ సంస్కృతిని జరుపుకునే వార్షిక లాపు లాపు(Lapu Lapu Festival) ఉత్సవంలో నిందితుడు పాదచారుల వైపుకు కారును నడిపాడని పోలీసులు తెలిపారు. వాంకోవర్ పోలీస్ తాత్కాలిక చీఫ్ స్టీవ్ రాయ్ ఒక వార్తా సమావేశంలో మాట్లాడుతూ, ఈ సంఘటనలో ఒక వాహనం, ఒక అనుమానితుడు పాల్గొన్నారని చెప్పారు. ఈ సంఘటనలో తొమ్మిది మంది మరణించారని పోలీసులు మొదట చెప్పారు. కానీ ఆదివారం ఉదయం వరకి మృతుల సంఖ్య 11కి పెరిగింది. ప్రధాన మంత్రి మార్క్ కార్నీ(Mark Carney) మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని ప్రకటించారు.