calender_icon.png 25 October, 2024 | 5:03 AM

హారన్ కొట్టడమే పాపమైంది.. కారు డ్రైవర్‌పై దాడి

26-06-2024 01:13:59 PM

హాన్మకొండ: హారన్ కొట్టుడే ఆ వ్యక్తికి ప్రమాదంగా మారింది. సామాన్యంగా మనం బండ్లు నడిపేటప్పుడు అడ్డం వాహనాలు వస్తే హారన్ కొట్టుడు సహజం. ఇలా కారు హారన్ కొట్టినందుకు కొందరు వ్యక్తులు ఓ డ్రైవన్ ను పట్టుకుని పొట్టు పొట్టు కొట్టిండ్రు. హారన్ ఎందుకు కొట్టావంటూ అంటూ ప్రశ్నిస్తూ కారు డ్రైవర్ పై దాడి చేశారు. ఈ సంఘటన హాన్మకొండలో చోటుచేసుకుంది. జాటోత్ నాగన్న అనే కారు డ్రైవర్‌కు శంభునిపేట జంక్షన్ వద్ద ఓ బైకు కారుకు అడ్డు వచ్చింది. దీంతో నాగన్న హారన్ కొట్టాడు. హారన్ ఎందుకు కొడుతున్నావంటూ కొందరు వ్యక్తులు కారును అడ్డగిచి అతనిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నాగన్నకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.