03-03-2025 12:04:50 PM
హైదరాబాద్: ఎన్టీఆర్ ఘాట్(NTR Ghat) సమీపంలో సోమవారం తెల్లవారుజామున డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో వేగంగా రావడంతో విధ్వంసం జరిగింది. కారు డివైడర్‌ను ఢీకొని ఫుట్పాత్ పైకి ఎక్కింది. అదృష్టవశాత్తూ ఈ సంఘటన జరిగిన సమయంలో పాదచారులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదంలో విద్యుత్ స్తంభంతో పాటు రెండు చెట్లు ధ్వంసం అయ్యాయి. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో విచారిస్తున్నారు.