calender_icon.png 28 December, 2024 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రిస్మస్ మార్కెట్‌లోకి దూసుకెళ్లిన కారు

22-12-2024 01:32:59 AM

బెర్లిన్, డిసెంబర్ 21: జర్మనీలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక మాగ్డేబర్‌లోని క్రిస్మస్ మార్కెట్‌లో ప్రజలపైకి బీఎండబ్ల్యూ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా 5గురు చనిపోగా 200 మందికి గాయాలయ్యాయి. వీరిలో 40 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్రిస్మస్ మార్కెట్‌లో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి సంబంధించి అరేబియాకు చెందిన తలేబ్‌ను జర్మనీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను కొన్నేండ్లుగా జర్మనీలో డాక్టర్‌గా స్థిరపడ్డారు. ఈ ఘటనపై జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వశాఖ సైతం ఈ ఘటనపై స్పందించింది. ‘జర్మనీలో జరిగిన హింసను ఖండిస్తు న్నాం. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మస్క్ స్పందిస్తూ జర్మనీ ఛాన్సలర్ స్కోల్జ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.