కామారెడ్డి జిల్లా మేనూరు వద్ద ఘటన
కామారెడ్డి, డిసెంబర్ 2 (విజయక్రాంతి): ప్రమాదవశాత్తు కారు దగ్ధ మైన ఘటన కామారెడ్డి జిల్లాలో చో టుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. మారేపల్లి నుంచి ఐదుగురు సోమవారం సిర్పూర్‌కు కారులో వెళ్తున్నారు. మద్నూర్ మండలం మీ దుగా వెళ్తుండగా ఒక్కసారిగా మం టలు చెలరేగడంతో వారు కారు ఆపి బయటకు దిగారు.
కాగా క్షణాల్లో కారు దగ్ధమవగా.. ఐదుగురు ప్రమా దం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఘటనపై మద్నూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పెట్రోల్ లీకేజీ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.