calender_icon.png 31 October, 2024 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్య మత్తులో ర్యాష్ డ్రైవింగ్.. బోల్తా కొట్టిన కారు

31-07-2024 09:07:27 PM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి కృష్ణానగర్ వైపు వెళ్తున్న ఇద్దరు యువకులు రోడ్డు పక్కన ఉన్న టెలిఫోన్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు బోల్తా కొట్టింది. దీంతో కారు నడుపుతున్న బీటెక్ విద్యార్థి సాకేత్ రెడ్డితో పాటు కారులో ఉన్న మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, స్థానికుల సాయంతో కారులో ఇరుక్కుపోయిన ఇద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో కారు నడిపిన సాకేత్‌రెడ్డికి పోలీసులు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయగా 146 పాయింట్ల రేంజ్‌లో మద్యం తాగినట్లుగా నిర్ధారణ అయింది.