ఆందోల్, జనవరి 29 : జోగిపేటలో కారు బీభత్సం సృష్టించింది. రెండు ద్విచ క్ర వాహనాలు ఢీకొని కారు పల్టీ కొట్టింది. టేక్మాల్ మండలం బొడ్మెట్పల్లి గ్రామానికి చెందిన మొగులయ్య మారుతి బ్రీజా కారు డ్రైవరు ముసా మద్యం మత్తులో ఉండి అతివేగం అజాగ్రత్త నడపడంతో ఈ ప్రమా దం జరిగింది. జోగిపేటలోని హనుమాన్ చౌరస్తాలో రెప్పపాటు క్షణంలో కారు బీభ త్సం అందర్నీ భయబ్రాంతులకు గురిచేసింది.
చౌరస్తాలో టీవీఎస్ ఎక్సెల్ ను ఢీ కొట్టి రాంగ్ రూట్లోకి వెళ్ళింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ ను ఢీకొని పక్కనే ఉన్న తెలుగుదేశం పార్టీ జెండా గద్దె పైకెక్కి పల్టీ కొట్టింది. ఎక్సెల్‌పై ఉన్న ఆందోల్ మండలం కంసాన్పల్లి చెందిన సంజీవులు బాలయ్యకు, బైక్‌పై ఉన్న అక్సా నిపల్లికి చెందిన రాజుకు తీవ్రగాయాల య్యాయి. వీరిని జోగిపేట ప్రభుత్వ ఆసుప త్రికి తరలించారు. కారు డ్రైవర్ను పోలీ సులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.