calender_icon.png 11 March, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఔటర్‌పై కారు బీభత్సం

07-03-2025 12:03:47 AM

ఇద్దరు మృతి, ఒక్కరి పరిస్థితి విషమం

ఇబ్రహీంపట్నం, మార్చి 6(విజయ క్రాంతి ) : ఔటర్ పై ఓ కారు బీభత్సం.. ఇద్దరు మృతి చెందిన ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొంగులూరు నుంచి తుక్కుగూడ వెళ్తున్న బ్రీజా కార్ ఆదిభట్ల వండర్లా ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టి.. ఔటర్ రింగ్ రోడ్డుపై డివైడర్ మధ్యలో ఉన్న చెట్లకు నీళ్లు పడుతున్న వాటర్ ట్యాంకర్ ను  వెనుక  భాగంలో  ఢీ కొట్టింది.

ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న ఆ వ్యక్తి అమాంతం పక్కకు ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు.. బ్రీజా కారు ముందు భాగం వాటర్ ట్యాంకర్ కిందికి వెళ్లడంతో కారు డ్రైవర్ పక్కన ముందు కూర్చున్న వ్యక్తి కూడా అక్కడికక్కడే మృతి చెందాడు.

ఔటర్ రింగ్ కార్మికుడు గా పని చేస్తున్న వ్యక్తి కొంగర కాలన్ గ్రామానికి చెందిన చెన్నమోని రాములుగా  గ్రామస్తులు ప్రాథమికంగా గుర్తించారు. గాయపడిన కారు డ్రైవింగ్ చేసిన వ్యక్తి ని నగరంలోని ఓ ఆసుపత్రికి అంబులెన్సు లో తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆదిభట్ల ఇన్‌స్పెక్టర్  తెలిపారు.