calender_icon.png 5 January, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బీభత్సం

01-01-2025 01:49:02 AM

రాజేంద్రనగర్, డిసెంబర్ 31: పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పై మంగళవారం ఓ స్కోడా కారు బీభత్సం సృష్టించింది. ముందు వెళ్తున్న మరో కారును ఢీకొనడంతో రెండు వాహనాలు అదుపుతప్పాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల్లోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో అందులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ క్రమంలో ఫ్లుఓవర్‌పై వాహనాలు భారీగా స్తంభించాయి. రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్‌గౌడ్ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.