07-03-2025 12:04:56 AM
మానకొండూర్, మార్చి 6:- శంకరపట్నం మండలంలోని తాడికల్ వంకాయ గూడెం గ్రామాల మధ్య జాతీయ రహదారి పై గురువారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... కరీంనగర్ లో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి హనుమకొండకు వస్తున్న గుడిపాటి భూపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల కారు అదుపు తప్పి ఆటోను ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. వంకాయ గూడెం సమీపంలోని జాతీయ రహదారి 563 పై వారు ప్రయాణిస్తున్న ఇన్నోవ కారు ఆటో ను ఢీ కొనడంతో ఆటో మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా కొట్టింది,ఇన్నోవా కారు ఫల్టీ లు కొడుతూ మరో టాటా ఏసీ ప్యాసింజర్ వాహనం ముందు బాగాన్ని ఢీ కొట్టి రోడ్డుకు అవతల తలక్రిందులుగా పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ద్విచక్ర వాహనదారునికి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాద స్థలానికి చేరుకున్న బ్లూ కోర్టు సిబ్బంది వాహనాలను అడ్డుతప్పించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.