అమరావతి: పల్నాడు జిల్లాలోని బ్రాహ్మణపల్లి సమీపంలోని అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గీతిక స్కూల్ సమీపంలో కారు చెట్టును ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలించారు. మృతులు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురం వాసులు తుళ్లూరు సురేష్, వనిత, యోగులు, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలోని కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని, కొత్త కారుకు పూజలు చేసుకుని తిరిగి వెళ్లుండగా ప్రమాదం జరిగింది. కొత్త అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.