హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం కారు బీభత్సం సృష్టించింది. పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో కారు డ్రైవర్ ఆపకుండా దూసుకెళ్లాడు. ఈ ఘటన పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద జరిగింది. కారు డ్రైవర్ సయ్యద్ నజీర్ హోంగార్డు రమేష్ పైకి దూసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా వాహనం ఆపిన హోంగార్డు రమేష్ ను కారుతో ఈడ్చుకెళ్లాడు సయ్యద్ నజీర్. ఈ ఘటనపై పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్ఐ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాహన తనిఖీలు సమయంలో వాహనదారులందరూ ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సూచించారు. లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్సై హెచ్చరించారు.