calender_icon.png 15 March, 2025 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

15-03-2025 12:00:00 AM

బాలకృష్ణ ఇంటిముందు ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 14(విజయక్రాంతి) : నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఓ కారు శుక్రవారం బీభత్సం సృష్టించింది. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45మీదుగా వచ్చిన ఓ కారు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1లోగల ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు గల ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆ కారు ముందుభాగం దెబ్బతిన్నది. డ్రైవర్ అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.