calender_icon.png 7 March, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాచుపల్లిలో కారు బీభత్సం

07-03-2025 12:16:53 AM

  • ఓవర్ స్పీడ్ తో దుకాణాల పైకి దూసుకెళ్లిన కారు

కారుపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్

కుత్బుల్లాపూర్, మార్చి 6(విజయ క్రాంతి): బాచుపల్లి లో  కారు భీభత్సం సృష్టించింది. గండిమైసమ్మ నుండి బాచుపల్లి వైపు వెళ్తున్న వెర్నా కారు హైదరాబాద్ ప్రగతినగర్ వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని వీఆర్‌ఎస్ విజ్ఞాన జ్యోతి స్కూల్ గేట్ ముందు గల షుగర్ కేన్ దుకాణంపైకీ గురువారం ఉదయం ఓవర్ స్పీడుగా దూసుకు వచ్చి బలంగా ఢీకొట్టింది.

దీంతో షుగర్ కేన్ దుకాణం ధ్వంసం కావడంతో పాటు ఓ వ్యక్తికీ గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు.ఎంఎల్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ  సంవత్సరం చదువుతున్న స్టూడెంట్ సుమారు 100/km స్పీడ్ తో రాష్ డ్రైవింగ్ చేస్తూ వచ్చి ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు.ప్రమాదంకు గురైన కారుపై మాజీ మంత్రి,మేడ్చల్ ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి  అసెంబ్లీ పాస్ ఉండడం విశేషం.