03-03-2025 11:40:45 PM
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): నగరంలోని ఎన్టీఆర్ ఘాట్ సమీపంలో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి సెక్రటేరియట్ వైపు వెళుతుండగా వేగంగా వచ్చి ఎన్టీఆర్ ఘాట్ మూల మలుపు వద్ధ ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొని ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఓ విద్యుత్ స్తంభంతో పాటు చెట్లను ఢీకొట్టడంతో అవి ధ్వంసమయ్యాయి. ప్రమాద తీవ్రతకు కారు ముందు బాగం నుజ్జునుజ్జు కాగా, ప్రమాద సమయంలో ఈ రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కారులోని ఎయిర్‌బెలూన్లు తెరుచుకోవడంతో కారులోని వారికి ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. కాగా ప్రమాద సమయంలో ఆ కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.