calender_icon.png 5 December, 2024 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు బీభత్సం

05-12-2024 12:12:43 AM

  1. *పలువురికి గాయాలు
  2. *వాహనదారుడి అరెస్టు 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4 (విజయక్రాంతి): హబీబ్‌నగర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు నడుపుతున్న వ్యక్తి విచక్షణ రహితంగా డ్రైవింగ్ చేస్తూ హల్‌చల్ చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లెపల్లి అన్వర్ ఉలూమ్ కళాశాల సమీపంలోకి బుధవారం ఓ కారు వేగంగా వచ్చింది.

కారు నడుపుతున్న రాష్ డ్రైవింగ్ చేస్తూ ముగ్గురితో పాటు ఐదు వాహనాలను ఢీకొట్టాడు. ఘటనలో ఆ ముగ్గరికి స్వల్పగాయాలయ్యాయి. వాహనాలు ధ్వంసమయ్యా యి. స్థానికులు వాహనదారుడిని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపో యింది. వాహనదారుడు వేగంగా కారు నడుపుతూ పరరాయ్యాడు.

టనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా కారు నంబర్‌ను గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేసినట్లు హబీబ్‌నగర్ ఇన్‌స్పెక్టర్ టి.రాంబాబు తెలిపారు.