calender_icon.png 17 October, 2024 | 7:45 PM

ఆ మంటలు కనిపిస్తలేవా?

17-10-2024 01:29:31 AM

పంట వ్యర్థాల కాల్చివేతపై సుప్రీం ఆగ్రహం

పంజాబ్, హర్యానా ప్రభుత్వాలకు చీవాట్లు

ఇలాగే చేస్తే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని హెచ్చరిక

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: దేశ రాజధాని ఢిల్లీతోపాటు దాని చుట్టుపక్కల తీవ్ర వాయుకాలుష్యానికి కారణమవుతున్న పంట వ్యర్థాల కాల్చివేతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రైతులు పంట వ్యర్థా లు కాల్చివేయకుండా నివారించటంలో హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆక్షేపించింది.

గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కనీసం పాటించినట్లు కనిపించటంలేదని అసహనం వ్యక్తంచేసింది. ఢిల్లీలో వాయు కాలుష్య అంచనా, నియంత్రణ కోసం ఏర్పాటుచేసిన కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూం) ఆదేశాలను పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు పాటి ంచటం లేదని దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచా రించింది.

ఈ సందర్భంగా పంజాబ్, హర్యా నా ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తంచేసింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు స్వయంగా కోర్టుకు వచ్చి పంట వ్యర్థాల కాల్చివేతపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ‘ఇది రాజకీయ అంశం కాదు. సీఎస్ ఒకరి తరఫున పనిచేస్తున్నట్లయితే మేం వారికే సమన్లు జారీచేస్తాం. వచ్చే బుధవారం సీఎస్‌లు స్వయంగా వచ్చి అన్ని అంశాలపై వివరణ ఇవ్వాలి.

మేం గతంలో ఇచ్చిన ఆదేశాల్లో మీరు దేనినీ అమలుచేయలేదు. పంజాబ్ ప్రభుత్వం గత మూడేం డ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఈ ప్రవర్తన కచ్చితంగా కోర్టు ధిక్కరణే’ అని జస్టిస్ ఓకా అన్నారు. ‘పంట వ్యర్థాలను కాల్చివేసినప్పుడు ఎక్కడ మంటలు చెలరేగుతున్నాయో ఇస్రో ఎప్పటికప్పుడు ఆధారా లు ఇస్తున్నది.

అలాంటప్పుడు ఆ ప్రాంతాలను మీరెందుకు గుర్తించలేకపోతున్నారు? ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ధర్మాసనం పేర్కొన్నది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.