25-02-2025 02:16:26 AM
ప్రభుత్వంపై -హైకోర్ట్ ఫైర్
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందించేందుంకు ఆధార్ కార్డు తప్పనిసరినా? కార్డు లేకపోతే వైద్యసేవలు అందిం చలేరా?’ అంటూ హైకోర్టు సోమవారం రాష్ట్రప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. ఉస్మానియా ఆస్పత్రిలో ఓ అనాథ మహిళకు ఆ ధార్ కార్డు లేకపోయినా చికిత్స అందించిన ట్లు ఉన్న ఆధారాలు సమర్పించాలంటూ విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది.
ఆధార్ కార్డు లేనివారికి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందించకపో వడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెం దిన బైరెడ్డి శ్రీనివాసరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిల్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యారాతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఆకాశ్ బాగ్లేకర్ తన వాదనలు వినిపిస్తూ.. ప్రమీల భర్త కొన్నేళ్ల క్రితం కాలం చేశాడని, ఆమె చిన్న చిన్న పననులు చేసుకుంటూ తన ఆరేళ్ల కుమార్తెను పోషించుకుంటున్నదన్నా రు.
ఆధార్ కార్డు లేని కారణంగా ఆమెకు వై ద్యారోగ్యశాఖ వైద్యాన్ని నిరాకరించిందన్నా రు. ఆరోగ్యం పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు అనేకసార్లు చెప్పిందని, గుర్తిం పు కార్డు లేకపోయినంత మాత్రాన వైద్యం నిరాకరించడం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనన్నారు. చికిత్సకు ఆధార్ కార్డు సమర్పించాలంటూ ఏ చట్టంలోనూ నిబంధనలు లేవన్నారు.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయ వాది రాహుల్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. వైద్యారోగ్యశాఖ ఆధార్‌కార్డు లేకపో యినా వైద్యసేవలు అందిస్తున్నదన్నారు. పిటిషనర్ పేర్కొన్న మహిళకు వైద్యం అం దిందా? లేదా? అన్న అంశంపై విచారించి, త్వరలో వివరాలు సమర్పిస్తానని తెలిపారు. దీంతో ధర్మాసనం విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది.