calender_icon.png 28 September, 2024 | 8:46 AM

ఒక్క రోజు ఆగలేరా?

28-09-2024 03:17:12 AM

  1. ఆక్రమణల కూల్చివేతపై అంత తొందరేంది?
  2. ఇవాళ నోటీసులిచ్చి రేపు కూల్చివేస్తారా?
  3. కోర్టు ఉత్తర్వులను కూడా లెక్క చేయరా?
  4. హైడ్రా నోడల్ ఏజెన్సీనే కదా.. చట్టబద్ధత ఉందా?
  5. అమీన్‌పూర్ కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం
  6. హైడ్రా కమిషనర్ వ్యక్తిగత హాజరుకు ఆదేశం
  7. తదుపరి విచారణ 30వ తేదీకి వాయిదా

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): అక్రమ నిర్మాణాల పేరుతో హడావుడిగా కూల్చివేత చర్యలు ఎందుకు చేపడుతున్నారని హైడ్రాను హైకోర్టు నిలదీసింది. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇండ్ల కూల్చివేత ఎందుకు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ రోజు నోటీసు ఇచ్చి రేపు కూల్చేస్తారా? ఒక్క రోజు కూడా ఆగలేకపోతున్నారా? అని నిప్పులు చెరింగింది. అసలు హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏమిటో చెప్పాలని ఆదేశించింది. ఇదే విషయంపై రెండు వేర్వేరు కేసుల్లో గతంలోనే వివరణ కోరామని, ఇప్పుడు మళ్లీ కోరుతున్నామని గుర్తుచేసింది.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డి పంచాయతీలోని శ్రీకృష్ణ నగర్‌లో ఉన్న తమ భవనాన్ని కూల్చకుండా స్టే ఇవ్వాలని మహమ్మద్ రఫీ, గణేష్ కన్‌స్ట్రక్షన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ నెల 5వ తేదీన కోర్టు ఆ మేరకు ఆదేశాలు జారీచేసింది. అయి తే అమీన్‌పూర్‌లోని సర్వే నంబర్ 164లో ఉన్న ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను 48 గంటల్లో తొలగించాలని ఈ నెల 20న అమీన్‌పూర్ తహసీల్దార్ నోటీసులు జారీచేయటం తో ౨౧న హైడ్రా కూల్చివేతలు చేపట్టింది.

ఈ నోటీసులను సవాల్ చేస్తూ డాక్టర్ మహమ్మద్ రఫీ, గణేష్ కన్‌స్ట్రక్షన్స్ మళ్లీ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం విచారించారు. ఈ నెల ౫న జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా కూల్చివేత చర్యలు ఎందుకు చేపట్టారని హైడ్రా తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు.

తదుపరి విచారణ రోజు హైడ్రా కమిషనర్, అమీన్‌పూర్ తహసీల్దార్ వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని, కుదరకుంటే ఆన్‌లైన్‌లో అయినా తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు. ఈలోగా అమీన్‌పూర్ మున్సిపాలిటీ వివరణ తెలియజేయాలని ఆదేశించారు.

ఒక్కరోజు కూడా ఆగలేదు

తహసీల్దార్ నోటీసులు జారీచేసిన తర్వాత అధికారులు తమకు ఒక్కరోజు కూడా సమయం ఇవ్వలేదని పిటిషనర్లు వాపోయారు. పిటిషనర్ న్యాయవాది నరేందర్‌రెడ్డి వాదిస్తూ అమీన్‌పూర్ తహసీల్దార్ ఈ నెల 20వ తేదీతో ఉన్న నోటీసులను 21వ తేదీ సాయంత్రం ఆరున్నర గంటలకు అందజేశారని, 22వ తేదీ ఉదయం ఏడున్నర గంటలకు జేసీబీలు, బుల్డోజర్లతో 50 మంది సిబ్బందితో వచ్చిన హైడ్రా ఐదు అంతస్తుల ఆస్పత్రి భవనాన్ని కూల్చేసిందని చెప్పారు.

నం 165, 166ల్లోని మహమ్మద్ రఫీకి చెందిన 270 గజాల స్థలాన్ని గణేష్ కన్‌స్ట్రక్షన్‌కు విక్రయించారని, ఆ స్థలంలో నిర్మాణాలకు 2022 నవంబర్ 10వ తేదీన గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు తీసుకున్నారని వివరించారు. నిర్మాణాలు చేపట్టాక పంచాయతీ జోక్యంపై పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారని, ఈ కేసు వాదనల సమయంలో పంచాయతీ నుంచి అనుమతులు ఉన్నందున తాము జోక్యం చేసుకోవడంలేదని పంచాయతీ తరపు న్యాయవాది చెప్పటంతో ఆ పిటిషన్‌పై విచారణను కోర్టు మూసేసిందని గుర్తుచేశారు.

ఇటీవల హైడ్రా కూల్చివేత చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో హైడ్రా అధికారుల బెదిరింపుల కారణంగా మరోసారి హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. గత ఫిబ్రవరిలో పంచాయతీ ఇచ్చిన అనుమతులను రద్దు చేయగా వాటిని హైకోర్టు సస్సెండ్ చేసిందని తెలిపారు. తిరిగి ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలని పేర్కొంటూ అమీన్‌పూర్ తహసీల్దార్ ఈ ఏడాది ఏప్రిల్ 2న నోటీసు జారీ చేశారని, ఈ నోటీసులకు 15 రోజులు గడువు కావాలని పిటిషనర్లు కోరినప్పటికీ అనుమతించలేదని చెప్పారు.

పిటిషనర్లు 18న వివరణ సమర్పించినప్పటికీ పరిగణనలోకి తీసుకోలేదని, ఈ నెల 20వ తేదీన నిర్మాణాలను తొలగించాలనే నోటీసుల్లో 48 గంటలే గడువు ఇచ్చారని తెలిపారు. 21వ తేదీ సాయంత్రం నోటీసులు అందజేసి, ౨2వ తేదీ ఉదయమే కూల్చివేశారని వాపోయారు.

దీనిపై హైడా తరపు న్యాయవాది కటిక రవీందర్‌రెడ్డి వాదిస్తూ ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాల తొలగింపునకు యంత్రాలు, సిబ్బందిని పంపాలని అమీన్‌పూర్ తహహీల్దార్ ఈ నెల 21న లేఖ రాశారని, జీవో 99 ప్రకారం ప్రభుత్వ స్థలం రక్షణ కోసం యంత్రాలు, సిబ్బందిని పంపినట్లు వివరించారు. ఈ సమయంలో జోక్యం చేసుకొన్న ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదిపై ప్రశ్నల వర్షం కురిపించింది.

‘నోటీసులు జారీ చేసిన మరుసటి రోజే కూల్చేయాల్సిన అత్యవసరం ఏమెచ్చింది? గడువు ఇవ్వకుండా ఒక్క రోజులోనే కూల్చేస్తారా? శనివారం నోటీసు ఇచ్చి ఆదివారం కూల్చేస్తారా? ఆ తర్వాత కోర్టు పనిదినం వచ్చే వరకు ఒక్కరోజు కూడా ఆగలేరా? కూల్చేయడానికి అత్యవసరం ఏముంది? గడువు ఎందుకు ఇవ్వడం లేదు? అసలు హైడ్రాకు చట్టబద్ధత ఏది? దీనిపై రెండు కేసుల్లో వివరణ అడిగామని తెలియదా? ఇప్పుడు మళ్లీ అడుగుతున్నాం..

హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏమిటి? హైడ్రా నోడల్ ఏజెన్సీనే కదా? కోర్టు ఉత్తర్వులున్నా కూల్చివేత చర్యలు ఎలా చేపడతారు?’ అని ధర్మాసనం నిలదీసింది. గత ఉత్తర్వుల మేరకు పిటిషనర్ల విషయంలో విచారణ పూర్తయ్యే వరకు కొనసాతున్న నిర్మాణాల్లో జోక్యం చేసుకోరాదన్న ఉత్తర్వులు కూడా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో కూల్చివేత చర్యలు చేపట్టడం హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుందని మండిపడింది. 

ఇరువైపులా జీవిస్తున్న ప్రజలకు పునరావాస ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మూసీ, నాలాలను ఆక్రమించి కట్టిన 28 వేల ఇండ్లను కూల్చేయాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారని, దానికి సంబంధించిన వీడియోను మీడియా ముందు మంత్రి పొన్నం ప్రదర్శించారు. ఈ విషయం తెలియక కేటీఆర్, హరీష్‌రావు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

మూసీ ఆక్రమణలు తొలగించాలని గతంలో మంత్రి హోదాలో మీరు అన్నది వాస్తవం కాదా? అని నిలదీశారు. ఆ ప్రాంత ప్రజలకు పదివేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని బీఆర్‌ఎస్ చెప్పిందని మంత్రి గుర్తుచేశారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల నివసిస్తున్న వారందరికీ వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నానని చెప్పారు. మూసీకి సంబంధించి బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌ను డిస్టర్బ్ చేయడంలేదని అన్నారు.

పాత నగరానికి మెట్రో రానీయకుండా బీఆర్‌ఎస్ కుట్ర చేసిందని, పదేళ్లలో హైదరాబాద్‌కు చుక్క నీరు తేలేదని ధ్వజమెత్తారు. మూసీ పరీవాహక ప్రాంత వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి మెప్మా ద్వారా వారికి ఉపాధి కల్పించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన రింగ్ రోడ్డును 7300 కోట్లకు బీఆర్‌ఎస్ నేతలు అమ్మకున్నారని విమర్శించారు.

తాము హైదరాబాద్‌కు గోదావరి, కృష్ణ జలాలను తీసుకొచ్చి నీటి కొరతను తీర్చే ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన పనికి, చేసిన ఖర్చుపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఇల్లు మునిగితే 10 వేలు ఇస్తామని.. అవి కూడా బీఆర్‌ఎస్ కార్యకర్తలకు పంచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన పనుల కాంట్రాక్టులకు బిల్లుల కోసం జీహెచ్‌ఎంసీ ముందు కాంట్రాక్టర్లు నిరసనలు తెలుపుతున్నారని విమర్శించారు.

ప్రతిపక్ష నేతలకు సీఎంను కలవడం ఇష్టం లేకపోతే హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న తనతో చర్చించాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ తానా అంటే బీఆర్‌ఎస్ తందాన అంటుందని విమర్శించారు. మూసీని శుద్ధి చేయడానికి రూ.5,500 కోట్లతో ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడటంపై ప్రభుత్వానికి బాధ్యత ఉందని, దాన్ని చెడగొట్టేందుకు బీఆర్‌ఎస్ నేతలు పగటి వేషగాళ్ల మాదిరిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాకిస్థాన్ పేరు తెచ్చి కావాలనే రెచ్చగొడుతున్నారని మంత్రి పొన్నం మండిపడ్డారు.