calender_icon.png 29 October, 2024 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్జరీ చేయించుకోలే..

29-10-2024 12:06:41 AM

ప్రముఖ నటి నయనతార ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఆమె ముఖం గుండ్రంగా ఉండేది. ఆ తర్వాతి కాలంలో కోలగా మారిపోయింది. దీంతో ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇటీవల ఈ ఊహాగానాలు మరింత ఎక్కువవడంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై స్పందించింది నయన్. ‘నేను కొన్నేళ్లుగా ఐబ్రో షేప్‌ను ఎప్పటికప్పుడు మారుస్తున్నా.

ఈ కారణంగా నా మొహంలో మార్పు కనిపిస్తూ ఉండవచ్చు. దీంతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని వారంతా భావిస్తూ ఉండవచ్చు. నా డైట్ కారణంగా నా బరువులో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. అలాంటి సమయంలో బుగ్గలు లోపలికి వెళ్లడమో లేదంటే ఉబ్బడమో జరుగుతూ ఉంటుంది.

మీకంత డౌట్ ఉంటే నన్ను గిచ్చడమో లేదంటే కాల్చడమో చేస్తే నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదో అర్థమవుతుంది’ అని నయనతార వెల్లడించారు. ఇటీవలే నయనతార టెస్ట్, మన్నన్‌గట్టి చిత్రాల షూటింగ్‌ను పూర్తి చేశారు. అలాగే ఆమె నటించిన రెండు తమిళ్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తని ఒరువన్2లో సైంత నయన్ నటిస్తున్నారు. డియర్ స్టూడెంట్స్ అనే మలయాళ మూవీ షూటింగ్ ప్రస్తుతం నయన్ పాల్గొంటున్నారు.