29-04-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 28 (విజయక్రాంతి): సాధారణంగా రైతుల భూమిపై కన్నేసి, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను టార్గెట్ చేస్తూ భూకబ్జా లకు పాల్పడటం సర్వసాధారణం. వందల ఎకరాల అసలు పట్టేదారు వారసులకే నోటీసులు జారీ చేసి చుక్కలు చూపిస్తున్నారంటే వారు మామూ లు భూకబ్జాదారులు కాదని తెలుస్తోంది.
పాల్వంచ లోని కేటీపీఎస్ ఓ అండ్ ఎం కర్మాగారంలో డి ఈ స్థాయి అధికారి ప్రధా న సూత్రధారుడిగా భూ ఆక్రమణలు వెలు గు చూస్తున్నాయి. అతనికి స్థానికంగా ఉండే ఓ అధికార పార్టీ నాయకుడితోపాటు, ఓ రౌడీ షీటర్ తోడై టేకులపల్లి మండల తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది, కలెక్టరేట్ లో పనిచేస్తున్న ఓ నాలుగో తరగతి ఉద్యోగి సహాయ సహకారాలతో భూ కబ్జాలకు తెర లేపారు.
గంగారం రెవెన్యూ గ్రామంలో బి ఏ ఓ గా పనిచేసే నా ఓ ఉద్యోగి ప్రస్తుతం కలెక్టర్ కార్యాలయంలో నాలుగో తరగతి ఉద్యో గ పని చేస్తున్నాడు. రెవెన్యూ గ్రామంలోని భూ సమస్యలు సంపూర్ణంగా తెలియడంతో భూకబ్జాదారులకు అతనే పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. అతను అక్కడ పనిచేసిన రోజుల్లో పహానిలు మాయం చేసి అసలు రైతులపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా టేకులపల్లి తాసిల్దార్ కార్యాలయంలో కొంతమం ది సిబ్బంది నకిలీ పహానిలు ,పట్టేదారు పాసుపుస్తకాల తయారీకి సూత్రధారులుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.వివరాల్లోకి వెళితే కొండపల్లి గోపాల రావు, కొండపల్లి వెంకట రామారావు గంగారం రెవెన్యూ గ్రామంలో సుమారు 5 వేల ఎకరాలకు పట్టాదారులు. సీలింగ్ యా క్ట్ అమలకు ముందే వేల ఎకరాలను గిరిజనులకు గిరిజనేతరులకు వారు విక్రయిం చడం జరిగింది.
కొంత భూమిని కూతుర్లకు పసుపు కుంకు మ కింద భూముల ఇవ్వటం, మిగిలిన భూములు వారి వారసులకు సంక్రమించింది. వారే ఏళ్ల తరబడి పట్టాదారు లుగా కొనసాగుతున్నారు. భూ కబ్జాదారులకు ఆ భూమిపై కన్ను పడింది. భూ కబ్జాదారుల ముఠా కొంత కాలం క్రితం భద్రాచలం లోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాల యం నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా 1988 కన్నా ముందు నమోదైన ఎల్ టి ఆర్ కేసుల తీర్పుల ప్రతులను పొందారు .
వాటి ద్వారా రెవెన్యూ సిబ్బంది సహాయ సహకారాలతో నకిలీ స్టాంపు పేపర్ల ద్వారా తప్పుడు లింక్ డాక్యుమెంట్లు సృష్టించారు. అప్పటి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పహానిలు, పట్టాదార్ పాస్ పుస్తకాలు సృష్టించారు. అప్పటి ఆర్డీవో ధర్మారావు, వీఆర్వో భద్రమ్మ సంతకాలను సైతం ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. వారు సృష్టించిన నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల ద్వారా మొబైల్, కలెక్టర్ కోర్టుల్లో గిరిజనుల పేరుతో ఇప్పటివరకు పది కేసులు నమోదు చేశారంటే వారి పనితీరును తారేఫ్ చేయాల్సిందే.
సబ్ డివిజన్ కాకపోవడం వరంగా మారింది..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గంగారం రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్ 303/2/84 లో వేల ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ అధికారులు ఆ సర్వే నెంబర్ను సబ్ డివిజన్లో గా చేయకపోవడం, సరైన మ్యాపు లేకపోవడం కబ్జాదారులకు వ రంగా మారింది.
దాని ఆసరా చేసుకొని గతం నుంచే స్థానికంగా ఉన్నావో అధికార పార్టీ నాయకుడిగా చలామణి అవుతున్న వ్యక్తి, మరో గిరిజన వ్యక్తి గిరిజనుల పేరుతో 2015నుంచి ఇప్పటివరకు సుమారు 40 ఎల్ టి ఆర్ కేసులు నమోదు చేయించి, గిరిజనేతర రైతులను భయభ్రాంతులకు గురిచే సి వారిని బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బు లు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉ న్నాయి.
వారి బెదిరింపులకు లొంగని 10 కేసులో ఆర్డిఓ కోర్టు లో ఫైనల్ అయ్యాయి. మిగిలిన కేసులు రాజీకి పాల్పడి కొట్టివేయ డం జరిగింది. వారే ప్రస్తుతం భూకబ్జాదారులకు తెర వెనక నుండి నడుపుతున్నట్లు తెలు స్తోంది. అక్రమ కేసుల కారణంగా తాము ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గంగారం రెవిన్యూ గ్రామం పై సమగ్ర విచారణ చేపట్టాలి
గంగారం రెవెన్యూ గ్రామంలో భూ వివాదాలు, భూ కబ్జాదారుల ఆగడాలు అరికట్టాలంటే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి, కలెక్టర్ స్థాయి అధికారితో సమగ్ర విచారణ చేసి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని గంగారం రెవెన్యూ గ్రామ రైతులు వేడుకుంటున్నారు.