03-04-2025 12:59:55 AM
ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాం తి): భూములు అమ్మకుండా ప్రభుత్వానికి ఒక్కరోజూ కూడా నడపలేరా అని ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించా రు. హెచ్‌సీయూ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఎంపీ ఈటల మాట్లాడుతూ.. 1969 నాటి అనేకమంది విద్యార్థుల పోరాటం వల్ల 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా హెచ్‌సీయూ ఏర్పాటైందన్నారు. విశ్వవిద్యాలయం కోసం 2500 ఎకరాల భూమిని కేటాయించారని ఈటల తెలిపారు.
వర్సిటీకి సంబంధించిన 400 ఎకరా ల భూమిని రూ.40 వేల కోట్లకు అమ్మి సర్కారు నడపాలనే సిగ్గుమాలిన పనికి రేవంత్ రెడ్డి సర్కార్ ఒడిగట్టిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, స్కూళ్లు కట్టడానికి కనీసం స్మశాన వాటికలకు కూడా హైదరాబాద్‌లో స్థలం దొరకడం లేదన్నారు.
భూములమ్మేందుకే మిమ్మల్ని గెలిపించారా?: ఎంపీ డీకే అరుణ
ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాగా, ప్రభుత్వ భూముల అమ్ముతున్నార ని.. ఇది సీఎం రేవంత్ రెడ్డి సిగ్గుపడాల్సిన విషయమని ఎంపీ డీకే అరుణ ధ్వజమెత్తారు. ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో ఆమె మాట్లాడుతూ.. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కోకాపేటలో ప్రభుత్వ భూములు అమ్ముతుంటే వ్యతిరేకించిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నాడన్నారు.
ఉన్నత విద్య, విద్యార్థుల భవిష్యత్తు అని గొప్పగొప్ప మాటలు చెప్పి ఇప్పుడు హెచ్‌సీయూకు కేటాయించిన భూములు బలవంతంగా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. పభుత్వ ఆస్తుల పేరుతో విశ్వవిద్యాలయం భూము లు అమ్మేందుకే మిమ్మల్ని ప్రజలు గెలిపించారా అని ప్రశ్నించారు.