calender_icon.png 25 October, 2024 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మభాషలో చదువుకోలేమా?

12-10-2024 12:00:00 AM

 డా. ఎస్. విజయభాస్కర్ :

మనదేశంలో ప్రాథమిక పాఠశాల స్థాయిలో మాతృభాష లో విద్యా బోధన చేయాలని అనేక కమిషన్లు, కమిటీలు సిఫారసు చేశాయి. మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం. అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు నిరక్షరాస్యులయి నం దు వలన బడిలో మాట్లాడే భాషకు, ఇంట్లో మాట్లాడే భాషకు, ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులకు ఏమీ అర్థం కాకుండా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మాతృభాషలో విద్యాబోధన చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుందని ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయడానికి మక్కువ చూపుతున్నారు.

పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పరాయి దేశాలైన రష్యా, చైనా, ఇంగ్లాండ్, జపాన్ లలో వారి వారి మాతృభాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా రు. వారి మాతృ భాషలోనే పరిపాలన, న్యాయ వ్యవహారాలు, ఉన్నత చదువులు చేస్తారు. ఇంజనీరింగ్, వైద్యం, న్యాయశాస్త్రం ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్లే వారు మొదటి ఆరు నెలలు వారి మాతృభాషను నేర్చుకోవాలి.

తర్వాత ఉన్నత విద్య ను అభ్యసించడానికి అనుమతి ఇస్తారు. మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో పద వ తరగతి వరకు మాతృభాష ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులను జారీ చేశాయి. కాని దానిని అమలు చేసే నాథు డే లేడు.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తనిఖీ చేసే అధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో మాతృభాషలో పదవతరగతి వర కు తప్పకుండా చదవాలనే నిబంధనలు అమలు కావడం లేదు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, సీఆర్‌పీఎఫ్, మిలిటరీపాఠశాలలు ఇంకా అనేక కేంద్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలలో మాతృ భాష తెలుగును చదవకుండా పదవతరగతి పూర్తి చేస్తున్నారు.

మాతృభాషతో ప్రయోజనాలు

 మాతృభాషలో బోధన వల్ల పిల్లలు మరింత  మెరుగ్గా, తొందరగా అవగాహన చేసుకొని నేర్చుకుంటారు. పాఠశాలలో ఎక్కువగా గడపడాన్ని పిల్లలు ఆనందిస్తారు. పిల్లల్లో ఆత్మనిబ్బరం పెరుగుతుం ది. అంతేకాదు మాతృభాషలో విషయాన్ని వ్యక్తం చేయడం, బోధించడం, అభ్యసించడం చాలా సులువు.

మాతృభాషలో అధ్యయనం చేయడం వల్ల పిల్లలు కం ఠస్థం చేయకుండా భావాలను గుర్తు పెట్టకుని  రాయవచ్చు. విద్యార్థి స్వయంగా చది వి విజ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. మాతృభాష మాధ్యమం వల్ల దేశీయ భాషలు అభివృద్ధి చెందుతాయి. సామాజిక స్పృహ పెరుగుతుంది. పిల్లలు అదే పాఠశాలలో ఎక్కువ కాలం చదవడానికి ఇష్టపడతారు. మరోవైపు తల్లిదండ్రుల భాగస్వామ్యం పెరుగుతుంది.

కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ ప్రకారం మాతృభాషలో నేర్చుకునే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని, అందుకని దానిద్వారా ప్రపంచంలోకి చూసే హక్కు పిల్లలందరికీ ఉంది. యునెస్కో లాంటి సంస్థలు కూడా పిల్లలకున్న భాషాపరమైన హక్కును తెలియజేస్తున్నాయి.

మాతృభాషలో చదువు చెప్పడం పిల్లలకు వాళ్ల జాతి సంస్కృతులను చెప్పడం కూడా అని అంటున్నారు భాషా శాస్త్రజ్ఞులు. ఈ విషయాల్ని, మిగతా పరిశోధనలను దృష్టిలో పెట్టుకుని ప్రభు త్వం విద్యా బోధన పద్ధతుల్ని నిర్మించాలి. తల్లిదండ్రులు ఆ దిశలోనే ఆలోచించాలి.

అనాలోచిత నిర్ణయాలు

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో గతంలో పరిపాలించిన ప్రభు త్వాలు ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబో ధన ప్రారంభించి విద్యార్థులు ఆంగ్లం తప్పకుండా నేర్చుకోవాలని బలవంతంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో ఉన్న మౌలిక సదుపాయాల గురించి కాని, ఉపాధ్యాయుల అర్హతల గురించి కాని, ఆంగ్ల మాధ్యమంలో బోధించే ఉపాధ్యాయుల నియామకాలు కాని ఏమీ చేయ కుండా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయాలని బలవంతంగా రుద్దడం అనేక విమర్శలకు దారి తీసింది.

కేంద్ర ప్రభు త్వం నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌పిఈ -2020)ప్రకారం ప్రాథమిక, పాఠశాల స్థాయిలో మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చి ఉన్నత పాఠశాల స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేసినా ఇబ్బంది లేదని స్పష్టం చేయడం జరిగింది.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వాల స్థానంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో  రేవంత్ రెడ్డి సర్కారు రావడం, ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు చేయకుండా మాతృభాషలోనే విద్యాబోధన చేయడానికి ప్రొత్సాహం ఇస్తున్నారు.

ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేయడం, వచ్చే విద్యా సంవత్సరం (2025--26) నుండి తెలంగాణ రాష్ట్రంలో నూతన జాతీ య విద్యా విధానం అమలు చేస్తామని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంగ్లం లేకుండా ఎదగ్గ్గలమా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్ ఒక వ్యాసం రాయడం జరిగింది.

గతంలో ఉన్నతోన్నత అధికారులు మాతృ భాషలోనే విద్యాబోధన పూర్తి చేసిన వారు మాత్రమే. ఆంగ్లం లేకుండా ఖచ్చితంగా ఎదగగలమనేది చాలామంది మేధావుల అభిప్రాయం. తెలంగాణ ఉన్న త న్యాయస్థానం హైకోర్టులో ఇటీవల ఒక న్యాయ మూర్తి  తెలుగులో తీర్పు ఇచ్చి కేసులలో తీర్పులు తెలుగులో కూడా ఇచ్చి సామా న్య ప్రజలకు న్యాయాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నిరూపిం చారు. 

తెలంగాణ రాష్ట్రంలో న్యాయం, వైద్యం, పరిపాలన ప్రజలకు అర్థం కావడానికి అర్థం కాని ఆంగ్లంలో పరిపాలన, న్యాయ, వైద్య వ్యవహారాలు ఉండడంతో  ప్రజలకు అర్థం కాకుండా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆంగ్ల భాష నేర్చుకుంటేనే పెద్దపెద్ద ఉద్యోగాలు వస్తాయనే భ్రమనుంచి జనం బయటపడాలి.

ఆంగ్లం లేకుండా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక ఉద్యోగ అవకా శాలు ఉంటాయి.మాతృభాషను అభి వృద్ధి చేయడానికి ఆంగ్లంలో ఉన్న న్యా య, వైద్య, శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక, మిగ తా ఉన్నత చదువులను తెలుగులోకి అనువాదం చేయాలి.

మన దేశానికి స్వాతం త్య్రం సిద్ధించి 77 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ఇంకా ఇంగ్లీష్ భాషను వలసవాద బానిసత్వం నుండి బయట పడకపో వడం ఆందోళన కరమైన విషయం. మన దేశంలో స్వేచ్ఛ, స్వాతం త్య్రం సాధించినప్పటికీ ఇంకా ఆంగ్ల భాషా వ్యామోహం లో మాతృభాషను నిర్లక్ష్యం చేయడం విచారించదగిన విషయం.

 రేవంత్ సర్కార్  సముచిత నిర్ణయం

ఇద్దరు తెలుగు వారు కలిస్తే తెలుగు తప్ప అన్యభాషలు (ముఖ్యంగా ఆంగ్లం) లో మాట్లాడుతారనే అపవాదు ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో రేవంత్ సర్కార్ మౌలిక సదుపాయాలు కల్పించడం, ‘ఆదర్శ’, ‘అమ్మ’ పాఠశాలల పేరిట నిధులను మంజూరు చేసి ఎంతో అభివృద్ధి చేయడం వలన ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆకర్షితులు అవుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ మాతృభాష తెలుగుకు ప్రాధాన్యత ఇస్తుండడం ముదావహం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన జాతీయ విద్యా విధానం 2020 అమలు చేయనున్న సందర్భంగా మాతృ భాష (తెలుగు) మాధ్యమంలో విద్యాబోధన చేయడానికి అవకా శం ఉంటుంది.

నూతనంగా 11,061 మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో వస్తున్న సందర్భంగా మాతృభాషకు ప్రాధాన్యత పెరుగుతుంది. వీటన్నిటివల్ల మళ్లీ పాఠశాలల్లో  మాతృభాషలోనే బోధనకు అవకాశాలు పెరుగు తాయని ఆశించ వచ్చు.

- వ్యాసకర్త సెల్ : 9290826988