రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజుల దీర్ఘకాలిక బకాయిలను చెల్లించక పోవడం అన్యాయం. దీనివల్ల ప్రైవేట్ కాలేజీలు నిరవధిక బంద్‌కు వెళ్లే దుస్థితి ఏర్పడిందంటే, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి అర్థమవుతున్నది. సుమారు రూ.4 వేల కోట్లు బకాయిలు వున్నట్టు తెలుస్తున్నది. యాజమాన్యాలైనా ఉద్యోగులు, అధ్యాపకులకు వేతనాలు ఇవ్వాలి. దీని ప్రభావం విద్యార్థులపై పడుతున్నది. ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను అలవర్చుకోవాలి.
సంతోష్ స్వామి, ఆదిలాబాద్