calender_icon.png 5 January, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిమ్మంపేట ఉత్తిపోతలేనా?

04-01-2025 12:22:40 AM

  1. పనులు పూర్తయినా ప్రారంభంకాని లిఫ్ట్ ఇరిగేషన్
  2. తుప్పు పడుతున్న మోటార్లు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు
  3. జనవరిలోనే నీరందిస్తామంటున్న అధికారులు

ములకలపల్లి, జనవరి 3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో అన్ని రకాల పంటలకు అనువైన పంట పొ  ఉన్నా సాగునీరు లేక గిరిజన రైతులు ఏళ్ల తరబడి వరుణ దేవుడి కటాక్షంతోనే పం  పండిస్తున్నారు.

అయితే పదేళ్ల క్రితం అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ములకలపల్లి మండలంలోని తిమ్మంపేట గ్రామం  సు  884 ఎకరాలకు సాగు నీరు అందించాలనే సంకల్పంతో రూ.9 కోట్లతో లిఫ్టిరిగేషన్ (ఎత్తిపోతల పథకం) మంజూరు చేసింది. పనులన్నీ పూర్తయి నాలుగేళ్లు గడుస్తున్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. 

పాములేరు వాగులో నిర్మాణం

పాములేరు వాగులో తిమ్మంపేట గ్రామ  వద్ద సుమారు ఏడు గ్రామాల్లో 884 ఎకరాలకు సాగు నీరు అందించాలనే సంకల్పం  2015లో 200 హెచ్‌పీ సామర్థ్యం గల రెండు మోటార్లు అమర్చి వీటిని వాగుకు అనుసంధానం చేశారు. 10 అడుగుల లోతు  వాగు ఇసుకలో దించి ఇంటెక్ వెల్ నిర్మించి, 12 నీటి తొట్లు(డీసీ)లు నిర్మించారు. నాలుగేళ్ల క్రితమే ఈ పనులు పూర్త  నేటికీ ప్రారంభానికి నోచుకోకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.

ఖరీఫ్ సాగు వరకే..

ఈ జనవరిలో సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇరిగేషన్ డీఈ మోతీలాల్ చెపుతున్నారు. అయితే ఈ లిఫ్టిరిగేషన్ కేవలం ఖరీఫ్ సాగు వరకే అని చెప్పడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుత పాలకులు, అధికారులు ఆ లిఫ్టిరిగేషన్ ప్రారంభించి చేతులు దులుపుకుంటే.. తరువాత ఈ సాగు నీటిని నమ్మి తీవ్ర స్థాయిలో నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దృష్టి సారిం  ఇంటెక్ వెల్ 25 అడుగులు నిర్మించేలా అధికారులను ఆదేశించాలని రైతులు కోరుతున్నారు.

ప్రారంభించినా..ప్రశ్నార్థకంగానే సాగు?

రూ.9 కోట్లతో ఈ లిఫ్టిరిగేషన్ నిర్మించినప్పటికీ తమకు ఉపయోగపడదనే భావన రైతుల్లో వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం పాములేరు వాగులో నీరు పారక అడుగం  200 హెచ్‌పీ మోటార్లు రెండు అమర్చినప్పటికీ ఇంటెక్ వెల్ కేవలం 10 అడుగులు మాత్రమే తీసి నిర్మించారు. లిఫ్టిరిగేషన్ నిర్మించిన కుడి వైపు పూర్తిగా ఇసుక మేటలు వేయడంతో చుక్కనీరు లేదని అధికారులు భావించారు.

ప్రస్తుతం ఆ ఇసుక మేటలు తొలగి మరలా నీరు కొంత ఎడమ వైపు రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకొని పది రోజుల క్రితం టీజీఐడీసీ చైర్మన్ సమక్షంలో  ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రస్తుతం తాళ్లాపాయి, ములకలపల్లి, చౌటిగూడెం, పొగళ్లపల్లి, మంగళిగుట్ట గ్రామాల్లో పాములేరు వాగు ఎగువ భాగాన నిర్మించిన 15 అడుగుల ఫిల్టర్లకే ప్రస్తుతం నీరు సరిగా అందడం లేదు. వాగులో పూర్తిగా భూగర్భ జలాలు అడుగంటి వాగు ఎండిపోతున్నది. 

రెండు రోజుల్లో ప్రారంభ తేదీ ప్రకటిస్తాం

తిమ్మంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్త  ఇటీవల ట్రయల్ రన్ కూడా నిర్వహించి సక్సెస్ అ  రైతులకు సాగు నీరు త్వరగా అందించాలనే లక్ష్యంతో చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేయించాం. రెండు రోజుల్లో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభ తేదీని ప్రకటిస్తాం. 

 ఎమ్మెల్యే జారే ఆదినారాయణ