calender_icon.png 31 October, 2024 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్యారెంటీ ఇవ్వలేం.. ధాన్యాన్ని దించుకోలేం

31-10-2024 12:56:13 AM

సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు మిల్లర్ల విజ్ఞప్తి

సిరిసిల్ల, అక్టోబర్ 30 (విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించే వరకు ధాన్యాన్ని మిల్లులో దించుకోలేమని రైస్‌మిల్ యాజమానులు తేల్చిచెప్పారు. బుధవారం సిరిసిల్ల కలెక్టరే ట్‌లో రైస్‌మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు మిల్లర్ల నుంచి చేదు అనుభవం ఎదురైంది.

జీవో నెంబర్ 27 ప్రకారం మిల్లర్ల నుంచి బ్యాంక్ గ్యారెంటీ తీసుకొని, ధాన్యం తీసుకోవాలని ప్రతిపాదన తీసుకువచ్చిందని, ఇప్పటికే తమ ఇల్లు, మిల్లులు బ్యాంకుల్లో కుదవ పెట్టామ ని మిల్లర్లు ఆందోళన వ్యక్తంచేశారు. తిరిగి ధాన్యం తీసుకునేందుకు మళ్లీ బ్యాంక్ గ్యారెంటీలు పెట్టె ఆర్థికస్థోమత లేదని తేల్చిచె ప్పారు.

సన్నరకం ధాన్యం మిల్లింగ్ చేస్తే 67 కిలోల బియ్యం ఔటర్న్ రాదని, దానిని తగ్గించాలని కోరారు. కొన్నేళ్లుగా మిల్లర్లకు రావాల్సిన డ్రైయేజ్, మిల్లింగ్ చార్జీలు, తేమ శాతం, పాత గన్నీ బ్యాగ్‌లకు సంబంధించిన బకాయిలు వెంటనే విడుదల చేయడానికి ఒప్పుకొంటే ధాన్యం దించుకుంటామని మిల్లర్లు స్పష్టంచేశారు.

అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిల్లు లో ధాన్యం దించుకొని రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో మిల్లర్ల సంఘం అధ్యక్షుడు పబ్బా నాగరాజు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, కోశాధికారి శ్రీనివాస్‌తోపాటు పలువురు మిల్లర్లు ఉన్నారు.